మొదలైన హుజురాబాద్ బై పోల్

మొదలైన హుజురాబాద్ బై పోల్

హుజురాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ మొదలైంది. నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో 306 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 891 EVM లు, 515 వీవీ ప్యాట్స్ సిద్ధం చేశారు అధికారులు. 17 వందల 50 మంది పోలింగ్ విధుల్లో ఉన్నారు. 3 వేల 865 మంది పోలీస్ సిబ్బందితో పాటు 25 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

హుజురాబాద్ లో మొత్తం 2 లక్షల 37 వేల 36 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు లక్షా 17 వేల 933 మంది కాగా... మహిళా ఓటర్లు లక్షా 19 వేల 12 మంది ఉన్నారు. బుధవారం నుంచే ఇక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తెచ్చుకోవాలని సూచించారు అధికారులు.

ప్రతీ పోలింగ్ కేంద్రం నుంచి వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు EC. 127 సమస్యాత్మక ప్రాంతాలున్నాయని…వీటి దగ్గర గట్టి బందో బస్తు పెట్టామన్నారు శశాంక్ గోయల్. కంప్లైంట్స్ వస్తే వెంటనే స్పందించి స్పెషల్ టీమ్స్ ను పంపిస్తున్నట్లు తెలిపారు కలెక్టర్ ఆర్వీ కర్ణన్. డబ్బు పంపిణీపై సీ-విజిల్ యాప్ లో ఫిర్యాదు చేయొచ్చన్నారు.