స్టార్టప్స్​ కొలువుల్లో భారీగా కోత

స్టార్టప్స్​ కొలువుల్లో భారీగా కోత

బెంగళూరుకరోనా ఎఫెక్ట్‌‌తో భారీ ఎత్తున ఉద్యోగాలకు కోత పడుతోంది. స్టార్టప్‌‌లు ఉద్యోగుల కోత ప్రారంభించాయి. స్టాఫ్‌‌ను తగ్గించడంతో పాటు, కొంత మంది ఉద్యోగులకు జీతాలను కూడా తగ్గిస్తున్నట్టు కొన్ని సంస్థల ఉద్యోగులు తెలిపారు. కరోనా దెబ్బకు ఎక్కడిక్కడ వ్యాపారాలన్ని స్తంభించిపోయి, దేశాల ఆర్థిక వ్యవస్థలన్ని కుప్పకూలిన సంగతి తెలిసిందే. వ్యాపారాలు రన్ అయ్యేందుకు పలు కఠిన చర్యలు తీసుకుంటున్నాం… కానీ పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయన్నది తెలియడం లేదని కంపెనీలు ఉద్యోగులకు చెబుతున్నాయి. ఆన్‌‌లైన్ ఇన్సూరెన్స్ సంస్థ అక్కో 50 మంది ఉద్యోగులను తీసేసింది. వీరిలో ఎక్కువగా కస్టమర్ సర్వీస్, ఆపరేషన్స్, సేల్స్, మార్కెటింగ్ సెగ్మంట్లలో పనిచేసేవారే ఉన్నారు. ఓ ఇంగ్లీష్ వెబ్‌‌సైట్‌‌కి ఇచ్చిన సమాధానంలో కరోనా దెబ్బకు 50 మంది వరకు ఉద్యోగులు ప్రభావితమైనట్టు అక్కో ఫౌండరో వరుణ్ దువా చెప్పారు. ఇది అనూహ్య పరిణామమని, ఈ పరిస్థితికి తాము సిద్ధం కావాలని దువా అన్నారు.

లీడర్‌‌‌‌షిప్ టీమ్‌‌లో కూడా 50 శాతం నుంచి 70 శాతం వరకు వాలంటరీగా వేతనాన్ని కట్ చేసుకోవాలని ఉద్యోగులకు దువా పిలుపునిచ్చారు. కొన్ని వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని, అవి లాంగ్‌‌ టైమ్‌‌లో కూడా రికవరీ అయ్యే సూచనలు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిలో తాము తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను తీసివేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. కొన్ని రోల్స్‌‌లో టీమ్స్‌‌ ను కన్సాలిడేట్ చేస్తున్నట్టు తెలిపారు. వచ్చే రెండు నెలలు రూ.40 వేల వేతనం ఉన్న వారికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని క్లౌడ్ కమ్యూనికేషన్ సంస్థ ఎక్సోటెల్ చెప్పింది. నెల తర్వాత పరిస్థితి చూసి, తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. వేతనాల కోత వంటి పలు చర్యలను తాము తీసుకుంటున్నామని, ఈ కష్ట సమయంలో కంపెనీ నిలదొక్కుకోవాలంటే ఈ చర్యలు తప్పనిసరి అని ఎక్స్‌‌టెల్ సీఈవో శివకుమార్ గణేషన్ చెప్పారు. అయితే ఈసాప్స్ రూపంలో తమ ఉద్యోగులకు పరిహారాలు ఇవ్వనున్నట్టు తెలిపారు.

ఫేర్‌‌‌‌పోర్టల్ 500 మందిపై వేటు..

అమెరికాకు చెందిన ట్రావెల్ కంపెనీ ఫేర్‌‌‌‌పోర్టల్ కూడా ఇండియాలో 500 మందిని తీసేసింది. వారికి గత వారమే అధికారికంగా నోటిఫికేషన్ పంపింది.

ఇన్ కమ్ ట్యాక్స్ లో మార్పులు అమలు