ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ నికర లాభం రూ.16,099 కోట్లు .. మొత్తం ఆదాయం రూ.1.12 లక్షల కోట్లు

ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ నికర లాభం రూ.16,099 కోట్లు .. మొత్తం ఆదాయం రూ.1.12 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: స్టేట్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ (ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ) నికర లాభం (కన్సాలిడేటెడ్‌‌‌‌‌‌‌‌) ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.16,099.58 కోట్లకు పెరిగింది. కిందటేడాది  సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.14,752  కోట్లతో పోలిస్తే 9.13 శాతం పెరిగింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  వచ్చిన రూ. 18,356 కోట్లతో పోలిస్తే మాత్రం తగ్గింది. స్టాండ్  ఎలోన్ ప్రకారం చూస్తే ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ నికర లాభం  ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం రూ.13,264.52 కోట్ల నుంచి రూ.14,330.02 కోట్లకు చేరుకుంది.

బ్యాంక్ మొత్తం ఆదాయం  సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.1.12 లక్షల కోట్లకు ఎగసింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.88,733 కోట్ల ఆదాయాన్ని బ్యాంక్ ప్రకటించింది.  నికర వడ్డీ ఆదాయం (ఎన్‌‌‌‌‌‌‌‌ఐఐ) ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 12 శాతం పెరిగి  రూ. 39,500 కోట్లకు చేరుకుంది. బ్యాంక్‌‌‌‌‌‌‌‌ మొండిబాకీలు తగ్గాయి.  గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో 3.52 శాతం నుంచి 2.55  శాతానికి మెరుగుపడింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 2.76 శాతంగా రికార్డయ్యింది.

 ప్రొవిజన్లు, కాంటెంజెన్సీలు ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రూ.115.28 కోట్లకు తగ్గాయి. కిందటేడాది ఇవి రూ.3,039 కోట్లుగా రికార్డయ్యాయి. మొండిబాకీల కోసం కేటాయించిన ప్రొవిజన్లు రూ. 2,011 కోట్ల నుంచి రూ.1,815 కోట్లకు తగ్గాయి.  ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ నెట్‌‌‌‌‌‌‌‌ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో 0.80 శాతం నుంచి 0.64 శాతానికి మెరుగుపడింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్ 0.71 శాతంగా నమోదయ్యింది. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 14.28 శాతంగా ఉంది.