కేసీఆర్ తడాఖా చూపిస్తనని.. తుస్సు మనిపించాడు

కేసీఆర్ తడాఖా చూపిస్తనని.. తుస్సు మనిపించాడు

పంద్రాగస్టు నాడు సీఎం కేసీఆర్ తడాఖా చూపిస్తనని.. తుస్సు మనిపించాడని అన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్. ఈ రోజు బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన… కేసీఆర్ ఎప్పటిలాగేనే కోతలు తప్ప.. ప్రజల ఆకాంక్ష గురించి మాట్లాడలేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆశల పై నీళ్లు చల్లారని.. prc ,ir, వయో పరిమితి పెంపు..  నిరుద్యోగ భృతి లాంటి వాటిపై ప్రస్తావన లేదని చెప్పారు. ఆరోగ్య శ్రీ కి చెల్లించాల్సిన ధనాన్ని చెల్లించక పోవడంతో హాస్పిటల్స్ వైద్యాన్ని నిలిపివేశాయని అన్నారు.

కేంద్రం అమలు చేస్తున్న ‘ఆయుస్మాన్ భారత్’ ను రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు లక్ష్మణ్. మోడీ ఫొటో పెట్టాల్సి వస్తుంది కావునే ‘ఆయుస్మాన్ భారత్’ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదని.. ఇది దుర్మార్గపు చర్య అని అన్నారు. పేద ప్రజలకు మంచి జరిగే పథకాన్ని రాజకీయల దృష్టి నుంచి చూడకూడదని ఆయన చెప్పారు.

ఇంటర్ విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటం ఆడిందని అన్నారు లక్ష్మణ్. ఎప్పుడూ లేనంతగా ఇంటర్ విద్యార్థులు చనిపోతే కనీసం మానవత్వం లేకుండా ప్రభుత్వం ప్రవర్థించిందని అన్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన గ్లోబరీనా పై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు లక్ష్మణ్. మానవత్వంతో రాష్ట్రపతి స్పందించారని… ఇప్పటికే మరణించిన విద్యార్థుల కుటుంబాల కి పరిహారం ఇవ్వాలని కోరారు. సెక్రటేరియట్ షిప్టింగ్ వల్ల పాలన స్తంభిస్తుంది అని అన్నారు. చాలా రోజులనుంచి అవినీతి, దుబారాల వలన రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని అన్నారు. ఇది బంగారు తెలంగాణ కాదని బకాయిల తెలంగాణ, బాధల తెలంగాణగా మారిందని లక్ష్మణ్ తెలిపారు.