
ఎల్లుండి రాష్ట్ర కేబినెట్ మీటింగ్.. మున్సిపల్ చట్టానికి ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం ఎల్లుండి బుధవారం నాడు సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త మున్సిపల్ చట్టానికి ఆమోదం తెలపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
కొత్త మున్సిపల్ చట్టం డ్రాఫ్ట్ పై ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. చట్టంలో ప్రజాప్రతినిధుల బాధ్యతలు ఎలా ఉండాలన్నదానిపై నిర్ణయానికొచ్చారు. మున్సిపల్ చట్టం ఆమోదం కోసం జులై 18, 19 తేదీల్లో రాష్ట్ర అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 18న అసెంబ్లీని, 19న మండలిని సమావేశ పరచనున్నారు అధికారులు. జులై 18న బిల్లు పేపర్లను టేబుల్ చేసి.. 19న చర్చించి బిల్లును ఆమోదించి చట్టంగా మార్చుతారు.
మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడైంది.