ఇవాళ (జులై 24) రాష్ట్ర కేబినెట్ భేటీ.. స్వతంత్ర నిపుణుల కమిటీ కులగణన నివేదికపై చర్చించనున్న మంత్రివర్గం

ఇవాళ (జులై 24) రాష్ట్ర కేబినెట్ భేటీ.. స్వతంత్ర నిపుణుల కమిటీ కులగణన నివేదికపై చర్చించనున్న మంత్రివర్గం

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన కేబినెట్ ​భేటీ జరగనున్నది. కులగణనపై అధ్యయనం చేసిన జస్టిస్​ సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలోని స్వతంత్ర నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించి.. మంత్రివర్గం ఆమోదం తెలపనున్నది.  మొత్తం 242 కులాలను విశ్లేషించిన కమిటీ.. ప్రతి కులానికీ 42 పారామీటర్స్​ ఆధారంగా  సీబీఐ (కంపోజిట్​ బ్యాక్‌‌‌‌‌‌‌‌వార్డ్‌‌‌‌‌‌‌‌నెస్​​ఇండెక్స్​) రూపొందించింది. 

దీని ఆధారంగానే భవిష్యత్తులో  ప్రభుత్వ పాలసీలు, సంక్షేమ పథకాలు  రూపొందించుకునేలా కేబినెట్‌‌‌‌‌‌‌‌లో నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్​ సమావే శంలోపు పంచాయతీరాజ్​ చట్ట సవరణ ఆర్డినెన్స్ వస్తే రిజర్వేషన్లపై ముందుకు వెళ్ల డం.. ఒకవేళ గవర్నర్​ నుంచి ఆమోదం రాకపోతే  స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎలా అనేదానిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. 

ఏపీ, తెలంగాణ  సాగునీటి ప్రాజెక్టుల అంశాలపై ఏర్పాటు చేయనున్న అధికారుల కమిటీలో ఎవరు ఉండాలనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. గిగ్​వర్కర్ల సంక్షేమానికి సంబంధించిన ముసాయిదాపై కూడా కేబినెట్​చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నది.