V6 News

పేపర్ ఏజెంట్లను గిగ్ వర్కర్స్గా గుర్తించాలి..మంత్రి వివేక్ వెంకటస్వామికి స్టేట్కమిటీ నేతల వినతి

పేపర్ ఏజెంట్లను గిగ్ వర్కర్స్గా గుర్తించాలి..మంత్రి వివేక్ వెంకటస్వామికి స్టేట్కమిటీ నేతల వినతి

నిజామాబాద్, వెలుగు: ప్రతి రోజు న్యూస్​పేపర్లను ఇంటింటికీ పంపిణీ చేస్తూ చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్న తమను గిగ్​వర్కర్లుగా గుర్తించాలని స్టేట్​ప్రింట్​మీడియా డిస్ట్రిబ్యూషన్​ఏజెంట్స్​అసోసియేషన్​ప్రతినిధులు కోరారు. శుక్రవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్​వివేక్​ వెంకటస్వామిని కలిసి అందజేసిన వినతిపత్రాన్ని వారు శనివారం నిజామాబాద్​లో మీడియాకు రిలీజ్​చేశారు. పత్రికా వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి దీనిపై ఆధారపడి రాష్ట్రంలో 30 వేల మంది ఏజెంట్లు, హాకర్స్, పేపర్​బాయ్స్ పనిచేస్తున్నారని తెలిపారు.

కర్ణాటకలో ఇస్తున్నట్లు జనరల్, మెడికల్​ఇన్సూరెన్స్, టూవీలర్స్​కొనుగోలుకు బ్యాంక్​లోన్​ఇవ్వాలన్నారు. సమాజ సేవకులుగా గుర్తించి తమకు కార్పొరేషన్​లేదా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా కేంద్రాల్లో మీటింగ్​హాల్స్​నిర్మించి ఇవ్వాలని, ప్రతి జిల్లాలో కోఆపరేటివ్​ సొసైటీలు ఏర్పాటు చేసి సబ్సీడీ లోన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్​స్టేట్​ప్రెసిడెంట్​వనమాల సత్యం, వైస్​ప్రెసిడెంట్​డి.లింగమూర్తి, సెక్రటరీ యామిని మధుసూదన్, ఆర్గనైజింగ్​సెక్రటరీ వెన్న రవి తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్​లో చేరిన మాజీ ఎంపీపీ 

కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్​జిల్లా కౌటాల మండలానికి చెందిన మాజీ ఎంపీపీ బసర్కార్ విశ్వనాథ్ శనివారం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ప్రజా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందేలా పనిచేయాలని మంత్రి సూచించారు. నాయకులు అర్షద్ హుస్సేన్ తదితరులున్నారు.