
- కాంగ్రెస్ ఎస్టీ సెల్ రాష్ట్ర కో – ఆర్డినేటర్ రఘు
షాద్ నగర్, వెలుగు : నిజాలను దాచిపెట్టి అబద్ధాలు మాట్లాడితే అధికారం రాదని, షాద్ నగర్ ప్రజలకు వాస్తవాలు ఏమిటో తెలుసని, దీనిపై చర్చించడానికి తగిన ఆధారాలతో తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ఎస్టీ సెల్ రాష్ట్ర కో – ఆర్డినేటర్ పి.రఘు సవాల్ చేశారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి రాజకీయ విమర్శలు చేస్తే.. ఆయనను బూతులు తిట్టడడానికి బీఆర్ఎస్ నేతలకు సిగ్గు ఉండాలని మండిపడ్డారు.
ప్రతాప్ రెడ్డిని విమర్శించిన కొత్తూరు నేతలు కొందరు తమ భార్యల ప్రభుత్వ జాబ్ లను అడ్డంపెట్టుకుని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సభలు, సమావేశాలు మీడియాలో రాకుండా అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. పీసీసీ సభ్యుడు బాబర్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య, తిరుపతి రెడ్డి,శీను నాయక్, రాజు నాయక్ పాల్గొన్నారు.