కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొత్త లోగో

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొత్త లోగో

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొత్త లోగోను ఆమోదిస్తూ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన లోగో ను పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ప్రతిపాదించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ భద్రత, శాంతిభద్రతల సంరక్షణలో నిబద్ధతను సూచించేలా ఈ లోగోను రూపొందించారు. ఈ లోగోలో హూ డేర్స్.. హూ విన్స్(ధైర్యం చేసేవాడే గెలుస్తాడు) అనే పదం ఉంటుంది. 

దేశభక్తిని, పోలీస్ శక్తిని ప్రతిబింబించేలా లోగోలో అశోక చక్రం, నాలుగు సింహాల చిహ్నం చేర్చారు. కొత్త లోగో గురించి పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ 'కొత్త లోగో కమిషనరేట్ పోలీసుల్లో కొత్త స్ఫూర్తిని, ప్రజల పట్ల మరింత జవాబుదారీతనాన్ని తీసుకొస్తుంది.  ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు మేం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం' అని పేర్కొన్నారు. ఈ కొత్త లోగోను కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లోని అన్ని యూనిఫామ్ లు, వాహనాలు, అధికారిక పత్రాలపై ఉపయోగిస్తామని సీపీ వెల్లడించారు. 

కొత్త కానిస్టేబుళ్లకు టెక్నాలజీ ట్రైనింగ్ కంప్లీట్

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు టెక్నాలజీ వినియోగంపై దశలవారీగా ట్రెయినింగ్ క్లాసులు నిర్వహించినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. గురువారం రెండో  బ్యాచ్ శిక్షణ ముగించినట్లు ఆయన తెలిపారు. కమిషనరేట్ కేంద్రంలోని ఐటీ కోర్ ఆఫీసులో పోలీసులు ఉపయోగించే వివిధ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, సాంకేతిక పరిజ్ఞానంపై ఈ శిక్షణకొనసాగిందని చెప్పారు.

 శిక్షణలో భాగంగా పిటిషన్ డ్రాఫ్టింగ్ నుంచి ఛార్జిషీట్ దాఖలు వరకు గల విధానాలు, సీసీటీఎన్ఎస్ - 2.0, పిటిషన్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సిస్టమ్ లో ఈ-సమన్ల జారీ, అమలు,  టీఎస్-కాప్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్ సీఈఐఆర, సైబర్ క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్థిక, ఆర్థికేతర నేరాల గురించి, సీడీఆర్ వంటి అన్ని రకాల సాఫ్ట్ వేర్, అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై సమగ్ర శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏసీపీలు జి. విజయ కుమార్, వేణుగోపాల్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లు తిరుపతి, సరిలాల్, శ్రీనివాస్, వెంకటేశ్ , శ్రీనివాస్, తిరుమల్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.