టీచర్ల బదిలీలు, పదోన్నతుల ఆన్ లైన్ దరఖాస్తు గడువు పెంపు

టీచర్ల బదిలీలు, పదోన్నతుల ఆన్ లైన్ దరఖాస్తు గడువు పెంపు

టీచర్ల బదిలీలు, పదోన్నతుల ఆన్లైన్ దరఖాస్తు గడువును రాష్ట్ర విద్యాశాఖ పెంచింది. ఫిబ్రవరి 1 వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ జీవో జారీ చేసింది. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల  విజ్ఞప్తి మేరకు  విద్యాశాఖ గడువు పెంచింది.  గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం సోమవారం వరకు గడువు ముగిసింది.