
హైదరాబాద్, వెలుగు : చైనా, బ్రెజిల్దేశాలతో పోటీపడి రాష్ట్రంలో మొక్కలు పెంచుతున్నామని తెలంగాణ ఫుడ్స్చైర్మన్మేడె రాజీవ్‌సాగర్ అన్నారు. గడిచిన కొన్నేండ్లల్లో చైనాలో 500 కోట్ల మొక్కలు, బ్రెజిల్లో 300 కోట్ల మొక్కలు నాటితే మన రాష్ట్రంలో 250 కోట్ల మొక్కలు నాటామని చెప్పారు. దశబ్ది వేడుకల్లో భాగంగా సోమవారం నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ఫ్యాక్టరీలో హరితోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాజీవ్‌సాగర్ హాజరై మొక్కలు నాటారు. ఫారెస్ట్సర్వే ఆఫ్ఇండియా నివేదికల ప్రకారం.. రాష్ట్రంలో పచ్చదనం 7.7 శాతం పెరిగిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో పోలింగ్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.