- రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య
భద్రాచలం, వెలుగు : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని రాష్ట్ర అటవీఅభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు. గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో గురువారం క్రాంతి విద్యాలయంలో ఆయన మొక్క నాటారు.
అనంతరం మాట్లాడుతూ గ్రీన్ భద్రాద్రి గత 14 ఏండ్లుగా భద్రాచలం పట్టణంలో మొక్కలు నాటుతూ, ప్రజల్లో చైతన్యం నింపుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తోందని ప్రశంసించారు. భవిష్యత్‌లోనూ పర్యావరణహిత కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.
విద్యార్థుల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించి భావి భారత పౌరులతో మొక్కలు పెంచేలా స్ఫూర్తి రగిలించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షురాలు చిట్టే లలిత, సమత, గ్రీన్ భద్రాద్రి మాజీ ప్రెసిడెంట్లు జీఎస్ శంకర్రావు, కృష్ణార్జునరావు, విద్యావేత్త తిప్పన సిద్ధులు పాల్గొన్నారు.
