మంథనిలో  బీజేపీ గెలుపు ఖాయం : దుగ్యాల ప్రదీప్ రావు

మంథనిలో  బీజేపీ గెలుపు ఖాయం : దుగ్యాల ప్రదీప్ రావు

మంథని, వెలుగు: అసమర్థ కాంగ్రెస్‌‌కు, అవినీతి బీఆర్ఎస్‌‌కు మంథనిలో ఇక మనుగడ లేదని, ఈసారి బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావు అన్నారు. మంథని పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌‌లో సోమవారం ఏర్పాటు చేసిన  నియోజకవర్గస్థాయి  ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ఆయనతోపాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్‌‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదీప్‌‌రావు మాట్లాడుతూ మంథనిలో కొత్త నాయకత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, 40 ఏండ్ల పాలనలో కాంగ్రెస్‌‌ , 10 ఏండ్ల పాలనలో బీఆర్ఎస్​నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.

కార్యక్రమంలో జిల్లా ఇన్‌‌చార్జి రామ్‌‌నాథ్, లీడర్లు రామ్ రెడ్డి, మోహన్ రావు, రమేశ్‌‌, క్రాంతి కుమార్, విజయరెడ్డి,  రంజిత్, సతీశ్‌‌, తిరుపతి, రాజేందర్, అజయ్, ప్రభాకర్, భాస్కర్ రెడ్డి, సంపత్ పాల్గొన్నారు.