ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్ను సవరించండి.. హైకోర్టును కోరిన రాష్ట్ర ప్రభుత్వం

ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్ను సవరించండి.. హైకోర్టును కోరిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కళాశాలల్లో ఈ నెల 10 నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులను సవరించాలంది. ఈ ఉత్తర్వుల కారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బకాయిలు చాలా కాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండటంతో పాటు, ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ జీవోలను సవాలు చేస్తూ పలు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కళాశాలలు హైకోర్టులో సవాలు చేశాయి. ఆ పిటిషన్లపై హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని ప్రభుత్వం తాజాగా మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గురువారం విచారణ జరుపుతామని న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జువ్వాడి శ్రీదేవి ప్రకటించారు. విచారణ సందర్భంగా కళాశాలల తరఫు సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యాయవాదులు ప్రభుత్వ విజ్ఞప్తిని తీవ్రంగా వ్యతిరేకించారు.

ప్రధాన పిటిషన్లలో ఇప్పటికీ ప్రభుత్వం కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోరడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఉన్న ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ చేసిన తర్వాత వారంలోపు కళాశాలలకు చెల్లించాలని సూచిస్తున్నప్పటికీ, విద్యార్థులు చెల్లించకపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. ఫీజుల చెల్లింపులకు సుమారు రూ.2,800 కోట్లు అవసరమవుతుండగా, ప్రభుత్వం కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించిందని, పాత బకాయిల చెల్లింపుపై కూడా స్పష్టత లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ప్రభుత్వం తరఫున సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యాయవాది రఘురాం వాదనలు వినిపించారు. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నందున తక్షణ చర్యలు అవసరమన్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిధులు జమ చేసేందుకు సిద్ధంగా ఉందని, అప్పటి వరకు కళాశాలలు వేచి ఉండాలని కోరారు. ప్రస్తుత విద్యాసంవత్సరపు తొలి విడత అడ్మిషన్లకు అవసరమైన నిధులను విడుదల చేస్తామని కూడా కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.