రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తప్పుడు లెక్కలు సమర్పించింది

రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తప్పుడు లెక్కలు సమర్పించింది

రాష్ట్ర ప్రభుత్వం …ఆర్టీసీకి సంబంధించి హైకోర్టుకు తప్పుడు లెక్కలు సమర్పించిందని ఆరోపించారు ఆర్టీసీ కార్మికుల జేఏసీ కన్వీనర్ అశ్వథామ రెడ్డి. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ వాయిదా పడిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన… 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీకి 1,099 కోట్లు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత  2014 నుంచి 2019 వరకు  బస్ పాసుల సబ్సిడీ కింద 1,375 కోట్లు వచ్చేవి ఉందన్నారు. మున్సిపల్ చట్టం ద్వారా 1496 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఇవన్నీ తమ న్యాయవాది కోర్టులో ప్రస్తావించగా మంగళవారం పూర్తి లెక్కలతో హాజరవుతామని చెప్పిన ప్రభుత్వం ఆర్టీసీకి బకాయిల కంటే ఎక్కువే ఇచ్చామని కోర్టుకు చెప్పిందన్నారు. ఇవన్నీ బోగస్ లెక్కలోనని హైకోర్టే వ్యాఖ్యానించిందన్నారు అశ్వథామ రెడ్డి .