
రాష్ట్రంలో ఆదివాసుల హక్కుల విధ్వంసం జరుగుతుందన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. ఆగష్టు 9ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరపాలని ఐరాస తీర్మానించి రెండు దశాబ్ధాలు గడుస్తున్నా నేటికి ఆదివాసీ జీవితాల్లో మార్పు రాలేదన్నారు కోదండరాం. సుప్రీంకోర్టు సరైనా సమాచారం ఇవ్వకపోవడంతో 93 వేల మంది భూములను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కొత్తగా నల్లమలలో యురేనియం తవ్వకాల పేరుతో ఆదివాసీల జీవనాన్ని విధ్వంసం చేసేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని చెప్పారు.