
హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో జరిగిన ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున చెల్లించినట్టు తెలిపింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు హైకోర్టులో కౌంటర్ పిటిషన్‌లో వివరించారు. ఈ ఘటనపై దాఖలైన పిల్‌పై తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.