
హైదరాబాద్, వెలుగు: జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన నేషనల్ అవార్డుల్లో రాష్ట్రానికి 13 దక్కాయి. ఇందులో 11 గ్రామ పంచాయతీలు ఉండగా, ఒక మండల పరిషత్, మరొకటి జిల్లా పరిషత్ ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షలు, మండల పరిషత్ కు రూ.75 లక్షలు, జిల్లా పరిషత్ కు రూ.3 కోట్లు క్యాష్ అవార్డ్ కేంద్రం ఇవ్వనుంది. ఈ నెల17న ఢిల్లీలో ఈ అవార్డులు ఆయా పంచాయతీల సర్పంచ్ లు, ఎంపీపీ, జడ్పీ చైర్పర్సన్ కు ప్రదానం చేయనున్నట్లు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఆర్థిక సలహాదారు విజయ్ కుమార్ బెహ్రా అన్ని రాష్ట్రాలకు గురువారం లేఖ రాశారు. రాష్ట్రానికి 13 అవార్డులు రావటంపై మంత్రులు ఎర్రబెల్లి దయకర్ రావు, కేటీఆర్, హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రెడిట్ అంతా సీఎం కేసీఆర్ కే దక్కుతుందని, పల్లె ప్రగతి సక్సెస్ అయిందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
అవార్డుకు ఎంపికైన గ్రామ పంచాయతీలు
- కొత్తగూడెం జిల్లా, చెంచుపల్లి మండలం గౌతంపూర్ గ్రామం- హెల్త్ కేటగిరీ(హెచ్పీ) - ర్యాంక్ 1
- జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామం - వాటర్ సఫీషియెంట్ (డబ్ల్యూఎస్పీ) - ర్యాంక్ 1
- మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కొంగట్ పల్లి - సోషల్లీ సెక్యూర్డ్
- ( ఎస్ఎస్పీ ) - ర్యాంక్ 1
- సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూర్ - ఉమెన్ ఫ్రెండ్లీ ( డబ్ల్యూఎఫ్పీవీ) - ర్యాంక్ 1
- గద్వాల జిల్లా రాజోలి మండలం మందొండి గ్రామం - పేదరిక నిర్మూలన, జీవనోపాధి పెంపు(పీఎఫ్ఈఎల్పీ) - ర్యాంక్ 2
- వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం చీమల్ దారి -గుడ్ గవర్నెన్స్
- (పీడబ్ల్యూ జీజీ ) - ర్యాంక్ 2
- పెద్దపల్లి జిల్లా సుల్తాన్ పూర్ మండలం ఎలిగేడు - క్లీన్ అండ్ గ్రీన్ ( సీజీపీ) - ర్యాంక్ 3
- సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట గ్రామం -స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల కల్పన ( ఎస్ఎస్ఐపీ) - ర్యాంక్ 3
- అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా ఖే - స్పెషల్ కేటగిరీ (జీయుఎస్ వీపీపీ ) గ్రామ
- ఉర్జ స్వరాజ్ విశేష్ పంచాయతీ పురస్కార్ రూ.50 లక్షలు ర్యాంక్ 3
- రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ ( సీఎన్వీపీపీ) కార్బన్ న్యూట్రల్ విశేష్ -
- ర్యాంక్ 2
- సిద్దిపేట జిల్లా మర్కూఖ్ మండలం ఎర్రవెల్లి (జీయుఎస్వీపీపీ) గ్రామ ఉర్జ స్వరాజ్ విశేష్
- ఉత్తమ మండల పరిషత్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎంఎల్డీ - ర్యాంక్ 2
- ఉత్తమ జిల్లా పరిషత్ ములుగు - ర్యాంక్ 2