గవర్నర్ను కలిసిన హార్టికల్చరల్ వర్సిటీ వీసీ రాజిరెడ్డి

గవర్నర్ను కలిసిన హార్టికల్చరల్ వర్సిటీ వీసీ రాజిరెడ్డి
  • ఉద్యాన పంటలపై ప్రణాళిక అందజేత 

హైదరాబాద్, వెలుగు: కొండా లక్ష్మణ్ హార్టికల్చరల్ యూనివర్సిటీ రూపొందించిన రాష్ట్ర ఉద్యాన ప్రణాళికను గవర్నర్ విష్ణు దేవ్ వర్మకు వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్​డాక్టర్ దండ రాజిరెడ్డి అందజేశారు. శనివారం గవర్నర్ కార్యాలయంలో కలిసి ఇటీవల నిర్వహించిన నాలుగవ వర్సిటీ స్నాతకోత్సవం ఆల్బమ్‌ను బహుకరించారు. 

రాష్ట్ర ఉద్యాన ప్రణాళికలో రాష్ట్ర వినియోగదారుల అవసరాలు, రైతుల ఆదాయాలు పెంచే విధంగా సాంకేతికతతో కూడిన మేలిమి విషయాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా సాగుతున్న కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ, ఔషద అవసరాలు, పంటల సాగు విస్తరణ, రైతుల ఆదాయాలపై ప్రధానంగా ఈ ప్రణాళిక ఉందని తెలిపారు.