
నిజామాబాద్, వెలుగు: ఆయిల్పామ్ సాగుతో లాభాలు ఆర్జించాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా రైతులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్న రైతులకు ప్రీ యునిక్ కంపెనీతో చేసిన బైబ్యాక్ అగ్రిమెంట్ పేపర్స్ పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 5,600 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు ఉండగా, ఈఏడాది 1,500 ఎకరాల్లో పంట కోతకు వచ్చిందన్నారు.
దిగుబడి ఎక్కడ అమ్మాలనే దిగులు రైతుల్లో లేకుండా కంపెనీతో అగ్రీమెంట్ చేయిస్తామన్నారు. గవర్నమెంట్ సబ్సిడీతో పాటు ఇతర అన్ని రకాల తోడ్పాటు అందిస్తుందన్నారు. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.