మంత్రి కేటీఆర్కు కోవిడ్

మంత్రి కేటీఆర్కు కోవిడ్

హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లుగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడించిన కేటీఆర్... ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా... గతేడాది ఏప్రిల్ లో కేటీఆర్ కరోనా బారినపడ్డారు.