సర్కారు బడుల సత్తా తేల్చే ‘స్లాస్’

సర్కారు బడుల  సత్తా తేల్చే ‘స్లాస్’

హైదరాబాద్, వెలుగు:  సర్కారు బడుల్లోని స్టూడెంట్లు, టీచర్ల సామర్థ్యాల పరిశీలనకు స్కూల్​ ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్ ఈ నెల 30న స్టేట్ లెవెల్ అచివ్ మెంట్ సర్వే(స్లాస్) నిర్వహించనుంది. సర్కారీ స్కూళ్లతోపాటు ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, టీఎస్ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న 4,84,601 మంది స్టూడెంట్లు పాల్గొననున్నారు. వీరిలో 8వ తరగతికి చెందిన 2,41,158 మంది, 9వ తరగతికి చెందిన 2,43,443 మంది హాజరు కానున్నారు. 30న ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ పరీక్ష ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ స్థాయిలో నేషనల్ అచీవ్ మెంట్ సర్వే(న్యాస్) నిర్వహిస్తోంది. కొన్ని స్కూళ్లను ఎంపిక చేసి.. వాటిలోని 50 శాతానికి పైగా స్టూడెంట్స్ కు ఈ పరీక్ష పెడుతుంది. అయితే అన్ని హైస్కూళ్లలోని స్టూడెంట్లు అందరికీ దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రస్థాయిలో స్లాస్ పేరుతో ఎగ్జామ్​ పెడుతున్నారు. హిందీ మినహా మిగిలిన అన్ని సబ్జెక్టులకు చెందిన వంద మార్కుల పేపర్ ను ఎస్సీఈఆర్టీ రెడీ చేస్తోంది. ఆబ్జెక్టివ్ టైప్​లో ఉండే ఈ పరీక్షలో, స్టూడెంట్లు ఓఎంఆర్ షీట్లలో ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే అన్ని స్కూళ్లకు అధికారులు సమాచారం ఇచ్చారు. ఎగ్జామ్ పేపర్లు, ఓఎంఆర్ షీట్లను పోలీస్ స్టేషన్లలో భద్రపర్చాలని, తిరిగి ఆన్సర్ షీట్ల (ఓఎంఆర్)ను అక్కడే అప్పగించాలని డీఈఓలు, ఎంఈఓలకు సూ‌‌‌‌చించారు. ఓఎంఆర్ షీట్ల ఆధారంగా రాష్ట్రస్థాయిలో ఏఏ సబ్జెక్టుల్లో, ఏ జిల్లాల్లో స్టూడెంట్ల స్థాయిని, దాని ద్వారా టీచర్ల పనితీరును అంచనా వేయనున్నారు.

15 రోజుల్లో ఫలితాలు: కమిషనర్

30న జరిగే స్లాస్ ఎగ్జామ్ కు అన్ని ఏర్పా ట్లు చేస్తున్నామని స్కూల్​ ఎడ్యుకేషన్​ కమిష నర్ విజయ్ కుమార్ తెలిపారు. 15 రోజుల్లో నే స్లాస్ ఫలితాలను విడుదల చేస్తామ న్నారు. స్లాస్ పరీక్ష ద్వారా స్టూడెంట్స్​తోపా టు టీచర్ల పనితీరూ గుర్తిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఏడో తరగతి స్టూడెంట్లకూ ఎగ్జామ్​ పెడ్తామనీ, ప్రైవేటు స్కూళ్లలోనూ నిర్వహించేందుకు చర్యలు తీసుకుం టామని విజయ్​కుమార్​ చెప్పారు.