చుంచుపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ రామచంద్ర ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీలో మంగళవారం 69 వ ఎస్జీఎఫ్రాష్ట్రస్థాయి అండర్14,17,19 విభాగాల్లో బాల బాలికల రైఫిల్ షూటింగ్ పోటీలను ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ ప్రారంభించారు. ఆదిలాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
పీప్, ఓపెన్, పిస్టల్ మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. అత్యధిక స్కోరు సాధించిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ సెక్రటరీ వాసిరెడ్డి నరేశ్‌కుమార్ తెలిపారు. బుధవారం తో రైఫిల్ పోటీలు ముగుస్తాయి.
కార్యక్రమంలో డీఈవో నాగలక్ష్మి, రాష్ట్ర పరిశీలకులు అరుణ, రాధిక, డీవైఎస్ఓ పరంధామ రెడ్డి, బీపీఎల్అధికారి చెంగలరావు, వివిధ జిల్లాల కోచ్ మేనేజర్లు, పీఈటీలు పాల్గొన్నారు
