హైదరాబాద్, వెలుగు: జనవరి 7 నుంచి కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నారు. నర్సన్నపల్లిలోని విద్యానికేతన్ హైస్కూల్లో జనవరి 9( మూడ్రోజులు)ఈ కార్యక్రమం జరగనున్నట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి.రమేశ్ తెలిపారు.
ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీచేశారు. స్టేట్ లెవెల్ బాల్ వైజ్ఞానిక్, ఇన్‌స్పైర్ అవార్డుల ప్రదర్శనలను ఇక్కడే నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన టీచర్లు, గైడ్ టీచర్లు జనవరి 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకల్లా కామారెడ్డిలోని విద్యానికేతన్ హైస్కూల్‌కు చేరుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
జనవరి 8న ‘‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం’’ అనే అంశంపై సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు కామారెడ్డి జిల్లా సైన్స్ ఆఫీసర్ ఎం.సిద్ధిరాంరెడ్డి 94404 14250ని సంప్రదించాలని డైరెక్టర్ సూచించారు.
