సరైన టైమ్​లో కాశ్మీర్ రాష్ట్రం 

సరైన టైమ్​లో కాశ్మీర్ రాష్ట్రం 
  • డీలిమిటేషన్ పూర్తి కాగానే అసెంబ్లీ ఎన్నికలు
  • ‘ఢిల్లీకీ దూరి.. దిల్​కీ దూరి’ తీసేయాలని కామెంట్
  •  మొత్తం 14 మంది నేతలు హాజరు

న్యూఢిల్లీ:జమ్మూకాశ్మీర్​కు సరైన టైంలో రాష్ట్ర హోదా కల్పిస్తామని ప్రధాని మోడీ చెప్పారు. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కాగానే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. గురువారం జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన 14 మంది నేతలతో ఢిల్లీలో ప్రధాని సమావేశం నిర్వహించారు. ఆర్టికల్ 370ని రద్దు చేశాక, జమ్మూకాశ్మీర్​ను రెండు యూటీలుగా విడగొట్టిన తర్వాత జరిగిన తొలి సమావేశమిది. ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌  షా, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, ఒమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ తదితరులు హాజరయ్యారు. దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజనపైనే చర్చ జరిగింది. రాష్ట్ర హోదా ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని మోడీ, అమిత్ షా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 
దూరం తొలగిద్దాం..
గతంలో డిస్ట్రిక్ట్ డెవలప్​మెంట్ కౌన్సిల్ పోల్స్‌‌‌‌‌‌‌‌ను విజయవంతంగా నిర్వహించినట్లే.. అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తామని మోడీ చెప్పారు. డీలిమిటేషన్ పూర్తి కాగానే ఎలక్షన్లు నిర్వహిస్తామన్నారు. సమావేశానికి హాజరైన మెజారిటీ నేతలు ఇందుకు సుముఖత వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్ సమాజంలోని అన్ని వర్గాలకు భద్రత ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని, ‘ఢిల్లీకీ దూరి.. దిల్​కీ దూరి(ఢిల్లీకి ఉన్న దూరం, మనసుకు ఉన్న దూరాన్ని)’ తీసేయాలని చెప్పారు. అయితే ఎన్నికల నిర్వహణకు ఎలాంటి నిర్ణీత కాలపరిమితి విధించలేదు. జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించాలని సమావేశంలో పాల్గొన్న వారందరూ డిమాండ్ చేశారు. లీడర్లు చెప్పిన విషయాలను ప్రధాని శ్రద్ధగా విన్నారు. 
రాష్ట్ర హోదా కల్పించాలె: ఫరూఖ్ అబ్దుల్లా
జమ్మూకాశ్మీర్​కు రాష్ట్ర హోదా కల్పించడం ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించే దిశగా కృషి చేయాలని ప్రధాని మోడీకి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్, మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా సూచించారు. జమ్మూకాశ్మీర్​కు స్పెషల్ స్టేటస్ కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని లీగల్​, రాజ్యాంగబద్ధంగా సవాలు చేస్తామని స్పష్టం చేశారు. కాశ్మీర్​కు రాష్ట్ర హోదా కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు మోడీ, అమిత్ షా చెప్పారని మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌  విషయంలో కేంద్రం దౌర్జన్యంగా వ్యవహరించిందని పీడీపీ చీఫ్‌‌‌‌  మెహబూబూ ముఫ్తీ అన్నారు. కేంద్ర సర్కారు నిర్ణయాన్ని ప్రజలు ఒప్పుకోలేదు. వారంతా కోపంగా ఉన్నారు. ప్రజల నుంచి తీసుకున్నదాన్ని తిరిగి ఇవ్వాలి అని డిమాండ్‌‌‌‌  చేశారు.
ప్రధాని ముందు ఐదు డిమాండ్లు: ఆజాద్
ఐదు కీలక అంశాలను తాము ప్రధాని ముందు ఉంచామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని, వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, స్థానికులకు భూమిపై గ్యారంటీ ఇవ్వాలని, కాశ్మీరీ పండిట్ల పునరావా సానికి చర్యలు తీసుకోవాలని, రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని కోరినట్టు తెలిపారు.