పోర్టల్​లో మార్కులు అప్​లోడ్ ​చేయండి

పోర్టల్​లో మార్కులు అప్​లోడ్ ​చేయండి
  •     స్కూళ్లకు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: విద్యార్థులకు సంబంధించిన మార్కులను వెంటనే ఐఎస్ఎంఎస్ పోర్టల్(schooledu.telangana.gov.in)లో అప్​లోడ్ చేయాల్సిందిగా స్కూళ్లను సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశించారు. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన కరికులర్, కో కరికులర్ సబ్జెక్టుల మార్కులను ఇంకా చాలా స్కూళ్లు అప్​లోడ్ చేయలేదని శనివారం పీడీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సమ్మెటివ్ అసెస్​మెంట్ 2 పరీక్షలు పూర్తయిన వెంటనే వాటి మార్కులతో పాటు కరికులర్, కో కరికులర్ మార్కులనూ సైట్​లో అప్​లోడ్ చేయాలని డీఈవోలు, హెడ్​మాస్టర్​లను ఆదేశించారు. 

కాగా, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్లకు ఇప్పటికే19,800 ట్యాబ్​లను ఇవ్వగా.. వాటికి తాజాగా జియో నెట్​వర్క్ సిమ్​లను అందజేస్తున్నట్టు పీడీ తెలిపారు. టీచర్లందరికీ సిమ్ కార్డులందేలా డీఈవోలు, ఈవోలు, డీపీవోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేలోపు సిమ్​లు వేసి ట్యాబ్​లను యాక్టివేట్ చేయాలని సూచించారు.