దళితుల హక్కులకు భంగం కలిగించొద్దు : ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

దళితుల హక్కులకు భంగం కలిగించొద్దు : ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
  •     రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

నిర్మల్, వెలుగు: దళితులను వేధింపులకు గురిచేయవద్దని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్‌పట్లలోని దళితుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారన్న ఫిర్యాదులపై ఆయన శనివారం గ్రామాన్ని సందర్శించారు. భూ యజమానులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూ యజమానుల సమ్మతి లేకుండా వారి భూములను స్వాధీనం చేసుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. దళితుల హక్కులకు భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం సహించదని,  చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో చట్టాన్ని చేతిలోకి తీసుకుని దళితులను వేధింపులకు గురిచేయవద్దన్నారు. గ్రామంలో సివిల్ రైట్స్ కార్యక్రమమం నిర్వ హించి గ్రామస్తులకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఏఎస్పీ సాయికిరణ్, ఆర్డీవో రత్నకల్యాణి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దయానంద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, తహసీల్దార్ మల్లేశ్, అధికారులు పాల్గొన్నారు.