
- ఆసిఫ్ నగర్లో మైనారిటీస్ గురుకులం ప్రారంభం
మెహిదీపట్నం, వెలుగు: విద్యా రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. అసిఫ్ నగర్లో రూ.8.75 కోట్లతో కొత్తగా నిర్మించిన తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ అండ్ హాస్టల్ ఫర్ బాయ్స్ భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మైనారిటీ గురుకులాలు, కాలేజీలు, వసతి గృహాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం పనుల కోసం రూ.40 కోట్లు అవసరమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అలాగే గురుకులాల్లో స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల కోసం రూ.7 కోట్లు కేటాయించామన్నారు.
కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్, టీజీఎంఆర్‌ఈఐఎస్ అధ్యక్షుడు ఫహీం ఖురేషీ, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి. షఫీఉల్లా, కలెక్టర్ హరిచందన, ఆర్డీవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.