ఇప్పుడు దానిపై మాట్లాడటం సరికాదు

ఇప్పుడు దానిపై మాట్లాడటం సరికాదు

పంజాబ్‌లో జరిగిన భద్రతా లోపం ఘటనపై తాన ఇప్పుడు మాట్లాడలేనన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తాను ఏమైనా వ్యాఖ్యలు చేస్తే.. అవి కాస్తా సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు కమిటీ చేపట్టిన దర్యాప్తుపై ప్రభావం చూపిస్తాయన్నారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANIకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వ్యూలో మాట్లాడుతూ.. మోడీ పలు వ్యాఖ్యలు చేశారు. భద్రతా లోపం అంశంపై తాను మౌనంగా ఉంటానన్నారు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తుందన్నారు. ఈ విషయంలో నేను చేసే ఏదైనా ప్రకటన చేస్తే అది కమిటీ చేపట్టే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని ఇది సరైన పద్ధతి కాదని  ఆయన అన్నారు. న్యాయవ్యవస్థపై తనకు విశ్వాసం ఉందన్నారు.  జరిగింది ఏదైనా సరే, సుప్రీంకోర్టు కమిటీ దేశం ముందు సత్యాన్ని తీసుకువస్తుందన్నారు ప్రధాని. అప్పటి వరకు మనం వేచి ఉండాలన్నారు. 

ఇటీవల, ఫిబ్రవరి 6న, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ మొదటిసారిగా ఈ కేసును విచారించేందుకు ఫిరోజ్‌పూర్‌లోని సంఘటన స్థలానికి చేరుకుంది. భద్రతా లోపంపై విచారణకు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఇందు మల్హోత్రా నేతృత్వంలో జనవరి 12న కమిటీని ఏర్పాటు చేసింది. గత నెలలో ప్రధాని భద్రత లోపం ఘటనపై కేంద్రం. పంజాబ్ ప్రభుత్వాలు వేర్వేరుగా దర్యాప్తు ప్రారంభించాయి. పంజాబ్ రిటైర్డ్ జస్టిస్ మెహతాబ్ సింగ్ గిల్, హోం సెక్రటరీ అనురాగ్ వర్మలతో కమిటీని ఏర్పాటు చేసింది. 

అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎస్పీజీ అధికారులతో పాటు భద్రతా కార్యదర్శి నేతృత్వంలో కేంద్రం విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కేంద్ర కమిటీ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఆపై వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం రెండు కమిటీలను కొట్టివేసింది. మోడీ భద్రతా లోపం ఘటనపై రిటైర్డ్ జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో సంయుక్త విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.