
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. రజినీకాంత్, టి. నాగరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ, లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు.
ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్,ఎంఈఓ, డీఈఓ, లెక్చరర్, డీఐఈఓ పోస్టులు భర్తీ చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న 9వేల కోట్ల స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ఈపీని రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీ తీర్మానం చేయాలన్నారు. బంద్ కు మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.