ఏపీలో రాజధాని తరలింపుపై స్టేటస్ కో పొడిగింపు

ఏపీలో రాజధాని తరలింపుపై స్టేటస్ కో పొడిగింపు

ఈనెల 27 వరకు ఏ ఒక్క ఆఫీసును తరలించవద్దన్న హైకోర్టు

అమరావతి: రాజధానిని మూడు ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. పరిపాల వికేంద్రీకరణ  చేయాలని.. 3 చోట్ల రాజధానులు  ఏర్పాటు చేసి సరికొత్త రీతిలో పాలన అందించడం కోసం తెచ్చిన చట్టం పై స్టే టస్ కో ఈనెల 27 వరకు పొడిగించింది హైకోర్టు. ఇవాళ ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి.

స్టేటస్ కో  తీసివేయాలని ప్రభుత్వం తరుపున న్యాయవాది  హైకోర్టును కోరగా.. కోర్టు నిరాకరించింది. ఆన్ లైన్ లో ఇబ్బందులు ఉన్నాయని.. హైకోర్టులో నేరుగా విచారణ జరపాలని పలువురు న్యాయవాదులు కోరారు. కరోనా కారణంగా నేరుగా హైకోర్ట్ లో వాదనలు వినిపించలేమని ప్రభుత్వం తరుపున న్యాయవాది రాకేశ్ ద్వివేది తెలిపారు. ఆయన ఢిల్లీ నుండి వాదనలు వినిపిస్తున్నారు. ఇరు పక్షాల వాదనల అనంతరం కేసు విచారణను ఈ నెల 27 కు వాయిదా వేసింది ధర్మాసనం.