రామాయంపేట, వెలుగు: కొడుకును చితక బాదిన సవతి తండ్రిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ ఐ బాలరాజ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అక్కన్నపేట గ్రామానికి చెందిన ముత్యం సత్యనారాయణ సెంట్రింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ నెల 13న రాత్రి తాగిన మత్తులో సవతి కొడుకైన నాలుగేళ్ల వంశీని ఇష్టం వచ్చినట్లు కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సత్యనారాయణను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. చిన్నపిల్లలపై ఎవరైనా క్రూరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
