
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్రను నియమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తెలంగాణలో హైదరాబాద్ రేంజ్ ఐజీగా పనిచేస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డేటా చోరీ కేసుపై… తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ఇంచార్జ్ గా వ్యవహరించారు స్టీఫెన్ రవీంద్ర. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ గా పనిచేశారు స్టీఫెన్ రవీంద్ర.
స్టీఫెన్ రవీంద్రది అనంతపురం జిల్లా. రాయలసీమలోనూ చాలాకాలం పోలీస్ అధికారిగా పనిచేశారాయన. మావోయిజం, ఫ్యాక్షనిజాలను కంట్రోల్ చేసిన ఆఫీసర్ గా ఆయన గుర్తింపు ఉంది. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడన్న పేరు కూడా ఉంది. దీంతో.. స్టీఫెన్ రవీంద్రను ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్టీఫెన్ రవీంద్ర నియామకం జరుగుతుందని తెలుస్తోంది.