అగ్రి చట్టాలకు అమెరికా మద్దతు

అగ్రి చట్టాలకు అమెరికా మద్దతు

చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచన

వాషింగ్టన్: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు అగ్రరాజ్యం అమెరికా మద్దతు తెలిపింది. కొత్త చట్టాల వల్ల ఇండియన్ మార్కెట్‌ విస్తరిస్తుందని, ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇన్వెస్ట్‌‌మెంట్లను ఆకర్షించడానికి వీలు కలుగుతుందని యూఎస్ అభిప్రాయపడింది. చట్టాల వల్ల ఏవైనా సమస్యలు ఉంటే శాంతియుతంగా నిరసనలు తెలిపితే బాగుంటుందని తెలిపింది.

అన్నదాతల సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అగ్రరాజ్యం సూచించింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు పర్యావరణ ఉద్యమకర్త గ్రెటా థన్‌‌బర్గ్, పాప్ స్టార్ రిహన్నా లాంటి కొందరు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వానికి యూఎస్ మద్దతుగా నిలవడం విశేషమనే చెప్పాలి. సాగు చట్టాలపై జరుగుతున్న నిరసనల మీద అడిగిన ప్రశ్నకు సమాధానంగా యూఎస్ స్టేట్ డిపార్ట్‌‌మెంట్ ప్రతినిధి పైవ్యాఖ్యలు చేశారు.