Olympics 2028: కోహ్లీ, స్మిత్ టార్గెట్ ఒకటే.. అప్పటివరకు క్రికెట్‌లో కొనసాగుతారా..

Olympics 2028: కోహ్లీ, స్మిత్ టార్గెట్ ఒకటే.. అప్పటివరకు క్రికెట్‌లో కొనసాగుతారా..

క్రికెట్ లో ప్రతి జనరేషన్ లో కొంతమంది ప్లేయర్లు తమదైన మార్క్ వేస్తారు. ఫార్మాట్ ఏదైనా నిలకడగా ఆడుతూ అలవోకగా పరుగులు రాబడతారు. ఈ తరంలో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, జో రూట్ ఈ లిస్ట్ లో ఉన్నారు. దశాబ్ద కాలంగా ఈ నలుగురు క్రికెట్ లో పోటీపడి మరీ పరుగులు చేశారు. ప్రస్తుతం వీరు క్రికెట్ లో పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్నారు. ఈ నలుగురిలో స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి టీ20 టెస్ట్ క్రికెట్ ఆడుతుంటే.. కోహ్లీ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. కోహ్లీ, స్టీవ్ స్మిత్ ఒకే టార్గెట్ పై దృష్టి పెట్టారు. తమ దేశాలకు ఎన్నో విజయాలను అందించిన వీరి గోల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 

లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028లో జరగనున్నాయి. ఈ విశ్వ క్రీడల్లో క్రికెట్ రీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో అన్ని దేశాలు తమ జట్లకు గోల్డ్ మెడల్ అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాయి. స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ సైతం 2028 ఒలింపిక్స్ ఆడాలనే తమ కోరికను తెలిపారు. ఈ ఏడాది మార్చిలో కోహ్లీ ఒలిపిక్స్ పై తనకు ఉన్న ఆసక్తిని తెలిపాడు. టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా ఒకవేళ భారత జట్టు ఒలింపిక్స్ ఫైనల్ కు వస్తే గోల్డ్ మెడల్ కోసం మ్యాచ్ ఆడాలని ఉందని తెలిపాడు. తాజాగా స్టీవ్ స్మిత్ సైతం తనకు ఒలింపిక్స్ ఆడాలని ఉందని చెప్పుకొచ్చాడు. 

ప్రస్తుతం హండ్రెడ్ లీగ్ లో ఆడుతున్న స్మిత్ తొలి మ్యాచ్ లో 18 బంతుల్లో 29 పరుగులు చేసి రాణించాడు. ఈ మ్యాచ్ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒలింపిక్స్ ఆడడానికి ప్రయత్నించడమే నా లక్ష్యం. ఈ క్రీడలు నన్ను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. టీ20 క్రికెట్ లో మెరుగవ్వడానికి ప్రయత్నిస్తాను. నా బెస్ట్ దేశానికి అందించాలి". అని స్మిత్ అన్నాడు. కోహ్లీ, స్మిత్ ఇద్దరూ కూడా 2028 ఒలింపిక్స్ లో ఆడడం దాదాపుగా అసాధ్యం. స్టార్ క్రికెటర్లు అయినా వీరిద్దరూ మరో మూడేళ్లు జట్టులో కొనసాగడం కష్టమనే చెప్పాలి. మరి వీరి కల తీరుతుందో లేదో చూద్దాం.