
- 25 లక్షల మంది టీచర్లపై ప్రభావం పడుతుందని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చి న తీర్పుపై స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ తీర్పు కారణంగా దేశవ్యాప్తంగా 25 లక్షల మంది టీచర్లపై ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ప్రస్తావించింది. ఎస్టీఎఫ్ఐ తరఫున అడ్వకేట్ సుభాశ్ చంద్రన్ మంగళవారం రివ్యూ పిటిషన్ ఫైల్ చేశారు.
తమిళనాడుకు సంబంధించిన కేసులో జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ మన్మోహన్తో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల స్పందిస్తూ.. "రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ (ఆర్టీఈ) 2009 తర్వాత నియమితులైన టీచర్లు టెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి. పదోన్నతి పొందాలన్నా టెట్ పాస్ కావాల్సిందే. లేకుంటే వారు ఉద్యోగం వదులుకోవాలి. అలాంటివారిని విధి గా ఉద్యోగ విమరణ చేయించి, సంబంధిత బెని ఫిట్స్ ఇచ్చి పంపండి" అని తీర్పు వెలువరించింది. ఈ అంశంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని కోరుతూ ఎస్టీఎఫ్ఐ ప్రతినిధులు ప్రకటన రిలీజ్ చేశారు.