లక్షన్నర లంచం : ఏసీబీకి చిక్కిన ఎస్టీవో అధికారి

లక్షన్నర లంచం : ఏసీబీకి చిక్కిన ఎస్టీవో అధికారి

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలోని ట్రెజరీ ఆఫీసులో గురువారం సాయంత్రం రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటూ ఎస్టీవో ఎస్.కె. సైదులు, సీనియర్ అసిస్టెంట్ ఎం.వెంకటేశ్ ఏసీబీకి దొరికిపోయారు. మన్యంలోని చర్ల అగ్రికల్చర్ కార్యాలయంలో ఏడీఏగా పనిచేసిన  బొల్లుమల్ల నారాయణ రిటైర్ అయ్యారు. ఆయనకు పెన్షన్ సెటి ల్‍కాలేదు. ఫైనల్ సెటిల్ మెంట్‌ కు ముందస్తుగా గతేడాది యాంటిసిపేటరీ పెన్షన్ మంజూరైంది. సుమారు రూ.28లక్షలు రావాల్సి ఉంది. ఫైల్ మూవ్ చేసేందుకు ఎస్టీవో సైదులు సీనియర్ అసిస్టెంట్​ వెంకటేశ్ ద్వారా బేరసారాలు జరిపాడు.

చివరకు రూ.1.50 లక్షలు ఇచ్చేందుకు నారాయణ ఒప్పుకున్నారు. ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో ట్రాప్ చేశారు. గురువారం నారాయణ ఎస్టీవో ఆఫీసుకు వెళ్లారు. సైదులు ఆఫీసులో లంచం తీసుకోకుండా వెంకటేశ్ ను గోదావరి కరకట్ట వద్దకు పంపించాడు. అక్కడ నారాయణ నుంచి వెంకటేశ్ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ మధుసూదన్‍రావు, ఇన్స్ పెక్టర్లు రమణమూర్తి, రవీందర్, క్రాంతికుమార్ పట్టుకున్నారు. వెంకటేశ్‍ వాంగ్మూలం ప్రకారం సైదులును అదుపులోకి తీసుకున్నారు.

see also: మార్చి 31 వరకు కరోనా సెలవులు

ఒక్కొక్కరు ఆరుగుర్ని కనండి