కరోనా​ షాక్..​ మార్కెట్​ షేక్

కరోనా​ షాక్..​ మార్కెట్​ షేక్

ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిన షేర్లు

మన దేశంలో ఐదున్నర లక్షల కోట్లు ఔట్​

సెన్సెక్స్​ 1500 పాయింట్లు డౌన్

శుక్రవారం ఒక్కరోజే కొత్తగా ఎనిమిది దేశాలకు వైరస్​ వ్యాప్తి

అన్ని దేశాలకూ పాకే ప్రమాదం ఉందన్న డబ్ల్యూహెచ్​వో

చైనాలో కొంత తగ్గినా.. ఇతర దేశాల్లో భారీగా పెరుగుతున్న కేసులు

దక్షిణ కొరియా, జపాన్, ఇటలీ, ఇరాన్, జపాన్​​ దేశాల్లో హైఅలర్ట్​

కొన్ని దేశాల్లో స్కూళ్లకు హాలీడేస్​

వైరస్​ వ్యాప్తి మొదలైన చైనాలో శుక్రవారం వరకు 78,824 మంది కరోనా వైరస్​ బారినపడ్డారు. ప్రధానంగా వూహాన్​ నగరం ఉన్న హుబే ప్రావిన్స్​లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటివరకు అధికారికంగానే 2,788 మంది మరణించారు. ఇందులో గురువారం ఒక్కరోజే 327 మందికి కొత్తగా వైరస్​ సోకగా.. 44 మంది చనిపోయారు. హుబే ప్రావిన్స్​తోపాటు చుట్టుపక్కల ప్రావిన్స్​లన్నీ ఇంకా క్వారంటైన్​ లోనే ఉన్నాయి.

యురోపియన్​ దేశాల్లో ఆగమాగం

చైనా నుంచి ఇరాన్, ఇటలీ మీదుగా యురోపియన్​ దేశాల్లోకి కరోనా వైరస్​ వ్యాప్తి చెందింది. ఆయా దేశాల్లో వైరస్​ బారినపడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇటలీలో ఇప్పటివరకు 400కుపైగా కరోనా కేసులు నమోదుకాగా.. 18 మంది మరణించారు. ఫ్రాన్స్​లోనూ 38 మందికి వైరస్​ సోకింది. ఇద్దరు చనిపోయారు. బ్రిటన్​లో ఇప్పటివరకు 19 మందికి కరోనా సోకినట్టుగా గుర్తించారు. జపాన్​ సముద్రతీరంలో నిలిపి ఉంచిన డైమండ్​ ప్రిన్సెస్​ క్రూయిజ్​ షిప్​ లో కరోనా వైరస్​ సోకిన బ్రిటీష్​ వ్యక్తి శుక్రవారం చనిపోయాడు. స్విట్జర్లాండ్​ ఎక్కువ మంది గుమిగూడే పార్టీలు, కార్యక్రమాలేవీ చేపట్టొద్దంటూ నిషేధం విధించింది. జర్మనీ కూడా కరోనా లక్షణాలతో బాధపడుతున్న వేల మందిని ఇండ్లలోనే క్వారంటైన్​ చేసింది. ఇక గల్ఫ్​ దేశాల్లో ఒకటైన అబుదాబిలో వైరస్​ సోకినవారు ఉండటంతో రెండు హోటళ్లను క్వారంటైన్​ చేశారు. వారికి సర్వీస్​ చేసిన సిబ్బందిని ఇండ్లలోంచి బయటికి రావొద్దని ఆదేశించారు.

స్టాక్స్

స్టాక్స్ యూరప్ 600 ఇండెక్స్ లండన్ టైమ్ ఉదయం 9.24 నిమిషాలకు 4.2 శాతం పడిపోయింది.

ఎస్‌‌‌‌ అండ్ పీ 500 ఇండెక్స్ ఫ్యూచర్స్ 2.1 శాతం డౌన్

నాస్‌‌‌‌డాక్ 100 ఇండెక్స్ ఫ్యూచర్స్‌‌‌‌కు 2.3 శాతం నష్టం

3.3 శాతం పడిన సౌత్ కొరియా కోస్పి ఇండెక్స్

ఎంఎస్‌‌‌‌సీఐ ఆసియా పసిఫిక్ ఇండెక్స్ 2.5 శాతం డౌన్

కరెన్సీలు…

0.3 శాతం పెరిగి 1.1038 డాలర్లుగా యూరో

0.1 శాతం పెరిగి 1.2894 డాలర్లుగా బ్రిటీష్ పౌండ్

జపనీస్ యెన్‌‌‌‌కు 0.9 శాతం లాభం, ఒక్కో డాలర్ 108.61

బాండ్లు..

10 ఏళ్ల ట్రెజరీస్ ఈల్డ్ 9 బేసిస్ పాయింట్లు పడి 1.17 శాతంగా నమోదు

10 బేసిస్ పాయింట్లు తగ్గిన రెండేళ్ల ట్రెజరీస్ ఈల్డ్

6 బేసిస్ పాయింట్లు పడిన బ్రిటన్ 10 ఇయర్ ఈల్డ్

జర్మనీ 10 ఇయర్ ఈల్డ్ 7 బేసిస్ పాయింట్లు డౌన్

కమోడిటీలు..

ఐరన్ ఓర్ 1.7 శాతం తగ్గి మెట్రిక్ టన్ను 82.18 డాలర్లుగా నమోదు

1.1 శాతం తగ్గిన ఎల్‌‌‌‌ఎంఈ కాపర్, మెట్రిక్ టన్నుకు 5,555 డాలర్లు

ఎల్‌‌‌‌ఎంఈ అల్యూమినియం 0.8 శాతం తగ్గి మెట్రిక్ టన్నుకు 1,677 డాలర్లుగా నమోదు

గోల్డ్ ఒక ఔన్స్‌‌‌‌కు 0.7 శాతం తగ్గి 1,633.46 డాలర్లుగా రికార్డు