వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. పగిలిన అద్దాలు

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. పగిలిన అద్దాలు

దేశంలో వందేభారత్ రైళ్లపై ఆకతాయిల రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది.  ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్ నుండి లక్నో మధ్య నడిచే సెమీ-హై-స్పీడ్ రైలు పై కొందరు  గుర్తు తెలియని దుండగులు ఇరువైపుల నుంచి దాడికి దిగారు.  ఈ రాళ్లదాడిలో కోచ్ నంబర్ C1, C3, ఎగ్జిక్యూటివ్ కోచ్ వద్ద నాలుగు కిటికీలు పగిలిపోయాయి. 

ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని రైలు మేనేజర్ రితేష్ సింగ్ తెలిపారు. దీనిపై  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కంట్రోల్ రూంకు ఫిర్యాదు  చేసినట్లుగా తెలిపారు.  గో గోరఖ్‌పూర్ నుండి లక్నో మధ్య నడిచే ఈ సెమీ -హై-స్పీడ్  రైలు వారానికి ఆరు రోజులు నడుస్తుంది. గతంలోనూ   వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ తరహా సంఘటనలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) జనవరిలో 21 కేసులు, ఫిబ్రవరిలో 13 కేసులు నమోదు చేసింది.