మేడారంలో స్టోన్ పిల్లర్ ఏర్పాటు..

మేడారంలో స్టోన్ పిల్లర్ ఏర్పాటు..

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం మంత్రుల పర్యటన అనంతరం సాయంత్రం సాలారంపై స్టోన్​ పిల్లర్​ను నిలబెట్టారు. ఆయా పనులను కలెక్టర్​ దివాకర, ఆర్అండ్ బీ ఈఎన్ సీ మోహన్ నాయక్ రాత్రి పర్యవేక్షించారు. మాస్టర్ ప్లాన్ పనుల్లో భాగంగా స్టోన్ పిల్లర్ నిలబెట్టడంతో పనుల్లో వేగం పుంజుకున్నట్లు అధికారులు వెల్లడించారు.