తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు

తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు

తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి.  రెండో ఘాట్ రోడ్డులోని హరిణీ పార్క్ సమీపంలో రహదారిపై బండరాళ్లు పడ్డాయి. అదృష్టవశాత్తు అదే సమయంలో ఆ రూట్ లో వాహనాలేవీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ సిబ్బంది వాహనదారులను అప్రమత్తం చేసి, దారికి అడ్డంగా పడిన రాళ్లను తొలగించారు. వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.