రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మానేసి అభివృద్ధిపై దృష్టి సారించాలె : బీజేపీ నాయకుడు రవి కుమార్

రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మానేసి అభివృద్ధిపై దృష్టి సారించాలె : బీజేపీ నాయకుడు రవి కుమార్

ఎమ్మెల్సీ కవితను బీజేపీలో చేరమన్నారని వస్తున్న వార్తలపై ఆ పార్టీ నాయకుడు రవి కుమార్ యాదవ్ స్పందించారు. ‘మీ దగ్గర చెల్లని రూపాయి మా దగ్గర ఎలా చెల్లుతుంది’ అని ప్రశ్నించారు. ఇకనైనా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మానేసి అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కూకట్ పల్లి డివిజన్ పరిధిలో పలు కాలనీల్లో బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికంగా ఉన్న ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హనుమాన్ నగర్ లో ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు రవి కుమార్ యాదవ్ కు చెప్పారు. తమ కాలనీలో సీసీ కెమెరాలు లేవని వాపోయారు. వెంటనే వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి,  పరిష్కరిస్తామని రవి కుమార్ హామీ ఇచ్చారు. బస్తీ బాట కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో ఇకపై యుద్ధమేనని అన్నారు. తమకు రానున్న 10 నెలలు చాలా కీలకమని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. దాదాపు 2 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలు, మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఫాం హౌస్ ఇష్యూతో సంబంధమున్న నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ ప్రశంసలతో ముంచెత్తినట్లు తెలుస్తోంది. ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు భయపడాల్సిన అవసరంలేదని తేల్చి చెప్పారు.