మహబూబాబాద్‌ జిల్లాలో గాలివాన బీభత్సం

మహబూబాబాద్‌ జిల్లాలో గాలివాన బీభత్సం

కొత్తగూడ/గూడూరు, వెలుగు : మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాల్లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు వీయడంతో కొత్తగూడ మండలం కొత్తపల్లి, గుంజేడు, పొగుళ్లపల్లి, ఓటాయి గ్రామాల్లో 100 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలవాలింది.

పలు గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగిపోవడంతో సరఫరాకు అంతరాయం కలిగింది. అలాగే గూడూరు మండలంలోని శీతానగరం, వెంగంపేట, దామెరవంచతో పాటు పలు గ్రామాల్లో చేతికొచ్చే దశలో ఉన్న మొక్కజొన్న నేలవాలింది. అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరారు.