
ఖమ్మం సిటీలో వింత పాము కనిపించింది. దేహంపై రెండు రకాల గుర్తులతో విచిత్రంగా ఉన్న ఈ పాము గురించిన వార్త సిటీ అంతా వ్యాపించింది. గురువారం (అక్టోబర్ 23) ఉదయం ఓ ఇంటి ఆవరణలోకి వచ్చిన వింత పామును చూసీ స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
స్థానికుల సమాచారంతో స్నేక్ క్యాకర్ వచ్చి పామును పట్టుకున్నారు. దేహం పై రెండు రకాల గుర్తులు ఉన్నాయని.. ఇప్పటివరకు ఇలాంటి పామును చూడలేదని అన్నారు. ఇప్పటి వరకు ఎన్నో పాములను పట్టుకున్నామని.. ఇ లాంటి పామును పట్టుకోవడి ఇదే తొలిసారి అని అన్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.