త్వరలో మహిళా సంఘాల బీమా టెండర్లు ఓపెన్

త్వరలో మహిళా సంఘాల బీమా టెండర్లు ఓపెన్
  • త్వరలో మహిళా సంఘాల బీమా టెండర్లు ఓపెన్
  • ప్రీ బిడ్ మీటింగ్​కు అటెండ్ అయిన 10 కంపెనీలు

హైదరాబాద్, వెలుగు :  మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్, లోన్  బీమాకు నోడల్ ఏజెన్సీగా ఉన్న స్త్రీనిధి ఇటీవల టెండర్లు ఆహ్వానించింది. వీటి ప్రీ బిడ్ మీటింగ్ ఇటీవల నిర్వహించగా 10 కంపెనీలు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ కంపెనీల్లో న్యూ ఇండియా ఇన్సూరెన్స్, యునైటైడ్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ ఇన్సూరెన్స్ లాంటి కంపెనీలు పాల్గొన్నాయి. కాగా, టెండర్లు సోమవారం ఓపెన్ చేయాల్సి ఉండగా హోలి నేపథ్యంలో అధికారులు వాయిదా వేశారు. త్వరలో ఈ టెండర్లను ఓపెన్ చేయనున్నారు.

రాష్ట్రంలో ఉన్న 64 లక్షల 35 వేల మహిళా సంఘాల సభ్యులకు ఇటీవల సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్, లోన్ బీమా స్కీమ్ లను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. టెండర్లు దక్కించుకున్న కంపెనీలకు ఆ రెండు స్కీమ్ లకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించనుంది. మహిళా సంఘాల సభ్యులు ఎలా మరణించినా ఈ రెండు స్కీమ్ లు అమలు కానున్నాయి.