మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి..

మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి..

వీధి కుక్కలు రోజురోజుకు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో  మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. 

 బోయవాడకు చెందిన మూడేళ్ల మన్విత్ పై వీధి కుక్క దాడి చేసింది.  ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో మన్విత్ పై కుక్క దాడి చేయడంతో  మెడపై, నుదుటిపై తీవ్ర గాయాలు అయ్యాయి.  గాయపడిన బాలుడిని మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  

కొన్ని రోజుల క్రితం దుబ్బవాడలో ఇప్పటికే 20 మందికి పైగా కుక్కల దాడిలో గాయాలు అయ్యాయి.  ఈ ఘటన మరవక ముందే  మరో సారి వీధి కుక్కల స్వైర విహారం చేయటం పై స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు వెంటనే వీధి కుక్కల బెడద లేకుండా చేయాలని కోరుతున్నారు.ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులపై ఆగ్రహం చేస్తున్నారు.రోడ్లపై తిరుగుతున్న కుక్కలతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.  కుక్కల భయంతో పిల్లలు బయట ఆడలేని పరిస్థితి నెలకొంది.