
- మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
- మాన్సూన్ ఏర్పాట్లు, జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులపై సమీక్ష
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్రోడ్లపై చెత్త కనబడినా, స్ట్రీట్లైట్లు వెలగకపోయినా బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్మంత్రి పొన్నం ప్రభాకర్హెచ్చరించారు. అభివృద్ధి పనులకు కావాల్సిన భూసేకరణ ప్రక్రియను స్పీడప్చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మాన్సూన్ ప్రిపరేషన్, అభివృద్ధి పనులపై సమీక్షించారు. అసంపూర్తి ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ పనులను పూర్తిచేయాలని, హెచ్ సిటీ పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
టెండర్లు పూర్తయిన వెంటనే పనులు మొదలవ్వాలన్నారు. పూడికతీత, వాటర్లాగింగ్పాయింట్ల వద్ద చర్యలను వివరించారు. జవహర్ నగర్ డంప్ యార్డ్ పై భారం పడుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ డంప్ యార్డు ఏర్పాటుకు స్థలాలు అవసరమని శానిటేషన్ అడిషనల్ కమిషనర్ మంత్రిని కోరగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు స్థల సేకరణ చర్యలు తీసుకునేలా చూస్తామని మంత్రి వివరించారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. మేయర్ గద్వాల్విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి, కమిషనర్ ఆర్.వి.కర్ణన్, జోనల్ కమిషనర్లు, సీఈ పాల్గొన్నారు.
హైదరాబాద్ లో స్థలాలు లేకపోవడంతో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం సాధ్యం కావట్లేదని, దీంతో డబుల్ బెడ్రూమ్ఇండ్లకు ప్రాధాన్యం పెరిగిందని చెప్పారు. అలాగే రూ.5.7 కోట్లతో రహమత్ నగర్ డివిజన్ లోని ఎస్పీఆర్ హిల్స్ లో వాటర్బోర్డు నిర్మించిన రిజర్వాయర్ ను శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఇక 52 బస్తీల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉండబోవన్నారు. వాటర్బోర్డు ఈడీ మయాంక్ మిట్టల్, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఇన్చార్జ్ అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.