వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల స్ట్రెస్‌ పెరుగుతుందంట

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల స్ట్రెస్‌ పెరుగుతుందంట
  • నిద్రలేక పోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింతుంది
  •  ఐటీ ఎంప్లాయస్‌ ఆవేదన

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగులకు ఇచ్చిన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో చాలా మందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఎక్స్‌పర్ట్స్‌ చెప్తున్నారు. మామూలు టైం కంటే ఎక్కువ సేపు వర్క్‌ చేయడం, బర్డెన్‌ ఎక్కువ అవడం వల్ల మానసిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయని అంటున్నారు. ఎక్కవు టైం ల్యాప్‌టాప్‌, ఫోన్లు చూడటం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఎంప్లాయస్‌ చెప్తున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ కారణంగా రెస్ట్‌ ఉండటం లేదని, స్ట్రెస్‌ పెరిగిపోతుందని అంటున్నారు. మొదట్లో ఇంటి నుంచి పనిచేయడం థ్రిల్లింగా ఫీల్‌ అయ్యామని, కానీ ఇప్పుడు అదే ఇబ్బందులు తెచ్చిపెడుతోందని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించి ఇప్పటికి 5 వారాలు గడిచింది. “ నేను మొదట్లో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చాలా ఎంజాయ్‌ చేశాను. కానీ రోజులు గడిచే కొద్ది ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. నా హెల్త్‌ పాడైపోయిందని అర్థం అవుతోంది. ఆఫీస్‌లో ఉంటే మీటింగ్స్‌, పక్కన వారితో ఇంటరాక్షన్‌ ఉండేది. ఇప్పుడంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. దీంతో అదే పనిగా సిస్టం, ఫోన్‌ చూడటం వల్ల బ్యాక్‌బోన్‌ పెయిన్‌ వస్తోంది” అని ఢిల్లీకి చెందిన సురేశ్‌ శర్మ అనే ఐటీ ఎంప్లాయ్‌ చెప్పాడు. ఇంట్లో ఉండి పనిచేయడం వల్ల బాడీకి ఎక్స్‌సైజ్‌ ఉండటం లేదని, వెయిట్‌ పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నామని మరి కొంత మంది చెప్తున్నారు. రెస్ట్‌ లేకుండా సిస్టం చూస్తున్న కారణంగా తలనొప్పి పెరిగిపోతుందని చెప్పారు. ఇలా ఉంటే చాలా మంది ఇబ్బందులు పడే అవకాశం ఉందని, స్ట్రెస్‌ రిలీఫ్‌కు ప్రతి ఒకరు జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్స్‌పర్ట్స్‌ చెప్తున్నారు. ఇంట్లో పనులతో పాటు పని కూడా పెరగడం వల్ల స్ట్రెస్‌ ఎక్కువ అవుతుందని, దాన్ని పొగొట్టుకునేందుకు యోగా, ఎక్స్‌సైజ్‌, మెడిటేషన్‌ చేయాలని సలహా ఇచ్చారు. మరి కొంత మంది జాబ్‌ ఉంటుందా లేదా అనే అంశంపై కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ కరోనా వల్ల చాలా మంది మెంటల్‌ హెల్త్‌ దెబ్బతినే అవకాశం ఉందని హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెప్తున్నారు. ఒక్కసారిగా పెరిగిపోతున్న కరోనా పాజిటివ్‌ కేసుల వల్ల కూడా ప్రజలు మెంటల్‌ డిప్రెషన్‌లోకి వెళ్తున్నారని సైక్యార్టిస్ట్‌ ఒకరు చెప్తున్నారు. మెంటల్‌ హెల్త్‌ ఇష్యూస్‌ను క్లియర్‌‌ చేసేందుకు ప్రభుత్వం 08046110007 హెల్ప్‌లైన్‌ నంబర్‌‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్ట్రెస్‌, టెంక్షన్‌ ఫీల్‌ అయినప్పుడు పాటలు వినడం, టీవీ చూడటం లాంటివి చేయాలని సూచించారు. కరోనాను అరికట్టేందకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో దేశంలోని 95 శాతం ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చాయి.