శ్రద్ధా కపూర్, రాజ్ కమార్ రావు లీడ్ రోల్స్‌లో నటించిన హిందీ చిత్రం ‘స్త్రీ 2’. హారర్ కామెడీ జానర్‌లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. విడుదలైన తొలిరోజునే ప్రపంచ వ్యాప్తంగా 92 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సరికొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసిన ఈ మూవీ.. విడుదలైన ఐదో వారంలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచేలా హయ్యస్ట్ గ్రాసింగ్ హిందీ ఫిల్మ్‌గా నిలిచింది. అత్యధిక వసూళ్లు సాధించిన ‘బాహుబలి 2’ చిత్రం రికార్డ్‌ను ఆరేళ్ల తర్వాత ‘పఠాన్’ క్రాస్ చేయగా, దాన్ని ‘గదర్ 2’ అధిగమించింది.
ఆ రికార్డ్‌ను షారుఖ్ ‘జవాన్’ బ్రేక్ చేసింది. ఇప్పుడు ‘జవాన్’ హిందీ వెర్షన్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ (రూ. 582.50 కోట్లు) ను బ్రేక్ చేస్తూ ఐదో వారంలోనే ‘స్త్రీ 2’ హిందీ వెర్షన్ రూ.586 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హిందీ సినిమాకి సంబంధించి నంబర్ వన్‌గా నిలిచి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమాలు అన్ని భాషలు కలుపుకుని వెయ్యి కోట్లు దాటుతున్నాయి. అయితే కేవలం హిందీ వెర్షన్‌తోనే ఓ లేడీ ఓరియెంటెడ్ హారర్ కామెడీ సినిమా ఇంత భారీ వసూళ్లను రాబట్టడం ఆశ్చర్యపరుస్తోంది.