నల్గొండ జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ, వెలుగు:  నల్గొండ జిల్లా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఉదయాదిత్య భవన్‌‌లో వ్యవసాయ, హార్టికల్చర్ శాఖల ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాల యజమానులు, వ్యవసాయ అధికారులు, ఏఈవోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద విత్తనాలపై వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. 

వరి సాగుపై మాత్రమే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని అధికారులకు ఆదేశించారు. యూరియా వినియోగం తగ్గించి నానో యూరియాను ప్రోత్సహించాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్‌‌ను వేగవంతం చేసి రోజుకు 6 వేలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.